అక్షరటుడే, ఇందూరు: Reels in Police Vehicle | పోలీసు వాహనంలోనే ఓ నిందితుడు రీల్స్ చేయడం నిజామాబాద్ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో Patrol vehicle కోర్టుకు తీసుకెళ్లారు. అయితే వాహనంలో ఉన్న నిందితుడు రీల్స్ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో Social media అప్లోడ్ చేయడంతో అవికాస్త వైరల్‌గా మారాయి. అయితే నిందితుడిని కలవడానికి వచ్చిన వ్యక్తులు రీల్స్ తీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Reels in Police Vehicle | ఫిబ్రవరిలో రీల్.. తాజాగా బయటకు..
అయితే సోహైల్ అనే వ్యక్తిని ఫిబ్రవరి 13న హత్యాయత్నం కేసులో కోర్టుకు తీసుకొచ్చారు. ఆరోజు సోహైల్‌కు చెందిన వ్యక్తులు వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అది వెలుగులోకి వచ్చింది.