ePaper
More
    HomeFeaturesOdisha | రీల్స్ పిచ్చి పీక్స్​.. రైల్వే ట్రాక్​పై పడుకున్న బాలుడు.. వీడియో వైరల్

    Odisha | రీల్స్ పిచ్చి పీక్స్​.. రైల్వే ట్రాక్​పై పడుకున్న బాలుడు.. వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ప్రస్తుతం కొంతమంది సోషల్​ మీడియా (Social Media)లో ఫేమస్​ కావడానికి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్​ (Reels) పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వ్యూస్​, లైక్​ల మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. కొందరు అసభ్యకర వీడియోలు, బూతులతో ఫేమస్​ అవుతుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు రీల్స్​ కోసం రైల్వే ట్రాక్​పై పడుకున్నాడు.

    ఒడిశా(Odisha)లో ఓ బాలుడు రైల్వే ట్రాక్​ (RaIlway Track)పై పడుకొని రీల్స్​ తీయడం గమనార్హం. రెండు సిమెంట్​ కడ్డీల మధ్య పడుకొని రైలు పోయేంత వరకు కదలకుండా అలాగే పడుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్​పై పడుకున్న బాలుడితోపాటు సహకరించిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏమాత్రం కదిలినా బాలుడి ప్రాణాలు పోయేవి. రీల్స్​, షార్ట్స్​ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

    Odisha | తల్లిదండ్రులు గమనించాలి

    ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉంది. చాలా మంది రీల్స్​, యూట్యూబ్​ వీడియోలు చూస్తూ టైం పాస్​ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజీ యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారారు. వీరు ఎలాగైనా ఫేమస్​ కావాలని నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. రీల్స్​ కోసం పిచ్చి చేష్టలు చేస్తే మొదట్లోనే మందలించాలని చెబుతున్నారు. లేదంటే తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే తీరని వేదన మిగులుతుందంటున్నారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...