అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో తగ్గిన ఛార్జీలు నేటి(శనివారం) నుంచి అమలులోకి వచ్చాయి.
కాగా మెట్రోకు నష్టాలు వస్తున్నాయని ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ టికెట్ రేట్ల(Ticket rates)ను పెంచిన విషయం తెలిసిందే. కనిష్ట టికెట్ ధర రూ.10 నుంచి 12కు గరిష్ట టికెట్ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచింది. పెంచిన రేట్లు మే 17 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే రేట్ల పెంపుపై ప్రయాణికుల(Passenger) నుంచి వ్యతిరేకత రావడంతో మెట్రో వెనక్కి తగ్గింది. పెంచిన రేట్లలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన మెట్రో ఛార్జీల(Metro Charges) ప్రకారం కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69 ఉండనుంది. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 3 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17.. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.28.. 6 నుంచి 9 కి.మీ వరకు రూ.37కి రేటు తగ్గించారు.
9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కు, 12 నుంచి 15 కి.మీ రూ.55 నుంచి రూ.51రేట్లను తగ్గించారు. 15నుంచి 18 కిలోమీటర్ల రూ.56, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61, 21 నుంచి 24 కి.మీ వరకు రూ.65, 24 కిలోమీటర్లపై ఉంటే రూ.69 మెట్రో ఛార్జి వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.