అక్షరటుడే, వెబ్‌డెస్క్: Redmi Note 14 SE | రెడ్మీ(Redmi) నోట్ 14 సిరీస్‌లో కొత్త ఫోన్ మోడల్‌ను లాంచ్ చేసింది. నోట్ 14 ఎస్ఈ 5జీ (Note 14 SE 5G) పేరుతో శక్తిమంతమైన ప్రాసెసర్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్ ధర రూ. 15 వేలలోపు ఉండనుంది. ఆగస్టు ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ 64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది.మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అమర్చారు.5,110 mAh బ్యాటరీ ఉంది. ఇది 45w వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ నాలుగు సంవత్సరాల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2.0తో పనిచేస్తుంది.వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ LYT 600 ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఏఐ కెమెరా, టెలిప్రాంప్టర్, గూగుల్ లెన్స్, ఏఐ బ్యూటిఫై, ప్రోమోడ్, పనోరమ తదితర ఫీచర్లున్నాయి.ఈ మోడల్ సింగిల్ వేరియంట్(Single variant)లో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ కెపాసిటీగల ఈ మోడల్ ధర రూ. 14,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్(Cashback) లభించనుంది. క్రిమ్సన్ రెడ్, మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.