అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Redmi Note 15 Pro 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ (Smart Phone) తయారీ సంస్థ అయిన రెడ్మీ మిడ్ రేంజ్లో కొత్త మోడల్‌ను భారత మార్కెట్ (Indian Market)లోకి తీసుకువస్తోంది. కొత్త మోడల్‌ను రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ పేరుతో ఈనెల 29న విడుదల చేయనుంది. భారీ కెమెరా, అధునాతన ప్రాసెసర్లతో తీసుకువస్తున్న ఈ ఫోన్.. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.
డిస్ప్లే : 6.83 ఇంచ్ 1.5కే OLED అమోలెడ్ డిస్ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1280 2772 పిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఐపీ68, ఐఈ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.
సాఫ్ట్వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ఇది 4కే వీడియో రికార్డింగ్ చేయగలదు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 6580 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ.. 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : సిల్వర్ యాష్, కార్బన్ బ్లాక్, మిరేజ్ బ్లూ కలర్లలో లభించనుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ధర రూ. 24,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.