Homeబిజినెస్​Stock Market | ఎరుపెక్కిన మార్కెట్లు.. భారీగా పతనమైన స్టాక్స్.. రూ. 7.5 లక్షల కోట్ల...

Stock Market | ఎరుపెక్కిన మార్కెట్లు.. భారీగా పతనమైన స్టాక్స్.. రూ. 7.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయంలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఒప్పందం విషయంలో జరుగుతున్న జాప్యం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచుతోంది.

కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు ఉత్సాహపూరితంగా లేకపోవడం, ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(FII’s) పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో మన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో సూచీలు పడిపోతున్నాయి. శుక్రవారం కీలకమైన 25 వేల పాయింట్ల సపోర్ట్‌ను నిఫ్టీ(Nifty) కోల్పోయింది. 25 వేల పాయింట్ల దిగువనే క్లోజ్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 119 పాయింట్ల నష్టంతో ప్రారంభమె అక్కడినుంచి మరో 672 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 204 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 721 పాయింట్ల నష్టంతో 81,463 వద్ద, నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో1,116 కంపెనీలు లాభపడగా 2,893 స్టాక్స్‌ నష్టపోయాయి. 145 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 111 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 68 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 4 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 7.5 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | అన్ని రంగాల్లో సెల్లాఫ్‌..

అన్ని రంగాల స్టాక్స్‌ ఊచకోతకు గురయ్యాయి. యుటిలిటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, పీఎస్‌యూ, ఎనర్జీ, పవర్‌ స్టాక్స్‌లో అమ్మకాల తీవ్రత ఎక్కువగా ఉంది. బీఎస్‌ఈలో యుటిలిటీ ఇండెక్స్‌ 2.37 శాతం, పవర్‌(Power) 2.36 శాతం క్షీణించాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 2.11 శాతం, పీఎస్‌యూ సూచీ 2.11 శాతం, ఇన్‌ఫ్రా 2.01 శాతం పడిపోయాయి. ఐటీ, మెటల్‌, కమోడిటీ, ఆటో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కన్జూమర్‌ డ్యూరెబుల్‌, ఎనర్జీ, టెలికాం ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ మాత్రమే 0.20 శాతం లాభంతో ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 1.88 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.46 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.01 శాతం నష్టపోయాయి.

Top Losers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 28 కంపెనీలు నష్టాలతో ఉండగా.. 2 కంపెనీలు మాత్రమే లాభాలతో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.73 శాతం, పవర్‌గ్రిడ్‌ 2.61 శాతం, ఇన్ఫోసిస్‌ 2.44 శాతం, టెక్‌ మహీంద్రా 2.44 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.29 శాతం నష్టాలతో ముగిశాయి.

Gainers:సన్‌ఫార్మా 0.35 శాతం, ఎయిర్‌టెల్‌ 0.55 శాతం లాభాలతో ముగిశాయి.

Must Read
Related News