అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ఎరుపెక్కింది. ఐటీ(IT), కన్జూమర్ డ్యూరెబుల్ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలకు బ్రేక్‌లు పడ్డాయి. నాలుగు సెషన్ల తర్వాత ప్రధాన సూచీ(Benchmark indices)లు నష్టాలబాట పట్టాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 29 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కోలుకుని లాభాలబాటపట్టాయి. రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం నేపథ్యంలో గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ(Profit booking)కు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన 82,257 నుంచి 81,681 పాయింట్లకు, నిఫ్టీ 25,192 నుంచి 25,022 పాయింట్లకు పడిపోయాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 195 పాయింట్ల నష్టంతో 81,731 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 24,035 వద్ద ఉన్నాయి.
మిక్స్‌డ్‌గా సూచీలు : బీఎస్ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ 1.27 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.67 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ(Realty) ఇండెక్స్ 1.46 శాతం, పవర్ 1.35 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.19 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.12 శాతం, యుటిలిటీ 1.10 శాతం, ఇన్ఫ్రా 0.95 శాతం, పీఎస్‌యూ 0.89 శాతం, ఎఫ్ఎంసీజీ 0.58 శాతం, బ్యాంకెక్స్ 0.57 శాతం నష్టాలతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
టైటాన్ 4.28 శాతం, ఇన్ఫోసిస్ 2.05 శాతం, టీసీఎస్ 1.70 శాతం, టెక్ మహీంద్రా 1.28 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.26 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బీఈఎల్ 1.60 శాతం, టాటామోటార్స్ 1.32 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.33 శాతం, ఎన్టీపీసీ 1.26 శాతం, ఎంఅండ్ఎం 1.19 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.