అక్షరటుడే, బోధన్: Chandur | ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) ఆధ్వర్యంలో విద్యార్థులకు రగ్గులను పంపిణీ చేశారు. చందూరు మండల కేంద్రంలోని బాలుర సంక్షేమ వసతి గృహంలో (boys welfare hostel) 25మంది విద్యార్థులకు వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ (Red Cross Society) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ.. చలికాలం నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంంతో రగ్గులను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 900కు పైగా రగ్గులను అందజేశామని ఆయన తెలిపారు.
విదార్థులు సైతం కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలలకు పేరు తేవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఏఈ గోపి, వసతిగృహం వార్డెన్ చంద్రశేఖర్, విద్యుత్ సిబ్బంది శ్రీనివాస్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
