అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ (Red Cross State Executive Member) అందిస్తున్న సేవలు గుర్తించి ఆయనకు జాతీయస్థాయి అవార్డు ఇవ్వడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయనను సన్మానించారు. అనంతరం వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్‌క్రాస్(Red Cross) రూపొందించిన వడదెబ్బ నివారణ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో(Zp Ceo) సాయి గౌడ్, రెడ్‌క్రాస్ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు(Red Cross Chairman Bussa Anjaneyulu), టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు సుమన్(TNGO Association President) తదితరులు పాల్గొన్నారు.
