అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెడ్‌క్రాస్ కార్యాలయం(Red Cross Office)లో శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎవరూ సహించలేరన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కార్యదర్శి అరుణ్ బాబు, జూనియర్ రెడ్‌క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్, సహ కార్యదర్శి పోచయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.