ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Sajjala Ramakrishna Reddy | ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది : సజ్జల

    Sajjala Ramakrishna Reddy | ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది : సజ్జల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjala Ramakrishna Reddy | ఆంధ్రప్రదేశ్​లో రెడ్​ బుక్​ పాలన (Red Book Rule) నడుస్తోందని వైఎస్సార్​సీపీ (YSRCP) నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్‌ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీ హయాంలో తాము ఫ్రెండ్లీ పోలీసింగ్‌ (Friendly Policing) అమలు చేశామన్నారు. కానీ నేడు రక్షించేవారే అరాచక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సమర్థులైన అధికారులను వీఆర్‌లో ఉంచుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో దాడి చేసిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పొలిటికల్‌ బాస్‌లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. దీంతో సామాన్యులు పోలీస్​ స్టేషన్​కు రావాలంటే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...