అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | మే నెల.. ఎండలు మండిపోయే మాసం. ఉదయం 6 అయితే సూర్యుడు భగభగమంటూ మండిపోతుంటాడు. బయటకు రావడానికి జంకుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. వర్షాలతో వణికిపోవల్సి వస్తుంది. బుధవారం హైదరాబాద్(Hyderabad)లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురవడంతో అధికారులు నగరవాసులకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తన్నారు అధికారులు. కాగా పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Hyderabad | డేంజర్ బెల్..
హైదరాబాద్ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోటి, అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. అలానే శంషాబాద్, ఆరాంఘర్, చంద్రాయణగుట్ట, అత్తాపూర్, రాజేంద్రనగర్, టోలిచౌకి, మెహదీపట్నం, లంగర్‌హౌజ్, గచ్చిబౌలి, నార్సింగ్, బండ్లగూడ, నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి,పటాన్‌చెరు, మియాపూర్ ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలానే రానున్న మూడు గంటల పాటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మాన్ పోస్ట్ చేశాడు. భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు (Telangana) రెయిన్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలో 4 రోజుల పాటు తుపాన్ తరహా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
