అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rains | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. పలు జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో బుధవారం తెల్లవారుజామునుంచే కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా కామారెడ్డి(Kamareddy), మెదక్లలో (Medak) కుండపోత వర్షం కురిసింది. లింగంపేట (Lingampet), నిజాంసాగర్ (Nizamsagar) తదితర ప్రాంతాల్లో చెరువులు తెగిపోయాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. ఇప్పటికే శ్రీరాంసాగర్ (Sriramsagar), నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) గేట్లను ఎత్తి దిగువకు వరదను వదులుతున్నారు. దీంతో దిగువ ఉన్న ప్రాంతాల్లో సైతం వరద చేరి జలమయయ్యాయి.
Heavy Rains | ప్రజలు బయటకు రావొద్దని..
అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ (Meteorological Department) రెడ్అలర్ట్ (Red Alert) ప్రకటించింది. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్, అదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
