అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jain Resource Recycling IPO | రీసైక్లింగ్ వ్యాపారంలో ఉన్న జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ కంపెనీ(Jain Resource Recycling) ఐపీవోకు వచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభమై ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ (GMP) 12 శాతంగా ఉంది.
జైన్ మెటల్ గ్రూప్‌నకు చెందిన జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ కంపెనీ భారతదేశంలో నాన్ ఫెర్రస్ లోహాలను రీసైక్లింగ్, ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీని 2022లో స్థాపించారు. ఈ కంపెనీ అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. ఇది ఒకే చోట బహుళ రీసైక్లింగ్(Recycling) ప్రక్రియలను నిర్వహించగలదు. పునర్వినియోగపరచదగిన పదార్థాలను సోర్సింగ్ చేయడానికి బలమైన ప్రపంచ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
ఈ సంస్థ లెడ్ యాసిడ్ బ్యాటరీలు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్, పిగ్మెంట్లు మరియు ఆటోమోటివ్ వంటి వివిధ పరిశ్రమలలోని వివిధ కంపెనీలకు తన ఉత్పత్తులను అందిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 1,250 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. రూ. 500 కోట్ల విలువైన 2.16 కోట్ల తాజా షేర్ల జారీతోపాటు రూ.750.00 కోట్ల విలువైన 3.23 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(Offer for sale) ద్వారా విక్రయించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ అప్పులలో కొంత భాగాన్ని చెల్లించడం కోసం,, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనుంది.
Jain Resource Recycling IPO | ఆర్థిక పరిస్థితి..
2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం(Revenue) రూ. 4,484.84 కాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,162.15 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం(Net profit) రూ. 163.83 కోట్లనుంచి రూ. 223.29 కోట్లకు, ఆస్తులు రూ. 1,528.76 కోట్లనుంచి రూ. 1,836.24 కోట్లకు చేరాయి. మార్చి 31, 2024 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 60 శాతం, పన్ను తర్వాత లాభం (PAT) 36 శాతం పెరిగడం గమనార్హం.
ధరల శ్రేణి..
జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఐపీవో ధరల శ్రేణి ఒక్కో ఈక్వింటీ షేరుకు రూ.220 నుంచి రూ.232 గా నిర్ణయించింది. లాట్ సైజు 64 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ.14,848 తో దరఖాస్తు చేసుకోవాలి.
కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 75 శాతం షేర్ల కోటాను కేటాయించిన కంపెనీ ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ రూ. 30 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 12 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Sbscription) బుధవారం ప్రారంభమై శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. 29న షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ ఒకటో తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.