- Advertisement -
HomeతెలంగాణMedical College | మెడికల్‌ కళాశాలల్లో నియామకాలు చేపట్టాలి

Medical College | మెడికల్‌ కళాశాలల్లో నియామకాలు చేపట్టాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Medical College | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలల్లో (Medical College) వెంటనే నియామకాలు చేపట్టాలని టీజీవో అసోసియేషన్‌ (TGO Association) అధ్యక్షుడు అలుక కిషన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో (Government Medical College) టీజీవో అసోసియేషన్‌ సమావేశం, సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అన్ని మెడికల్‌ కళాశాలల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌ నగర పరిధిలో జూనియర్‌ డాక్టర్లతో(Junior Doctors) పనిచేయిస్తూ, సీనియర్లను జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయించడం అన్యాయమన్నారు. గతంలో పదోన్నతులకు సేవల ఆధారంగా వెయిటేజీ ఇచ్చేవారని, ప్రస్తుతం దానిని నిలిపేశారని వివరించారు. అలాగే పీఆర్‌సీ బకాయిల విడుదల, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతి రావు, దేవిసింగ్, ఉపాధ్యక్షుడు రాములు, సంయుక్త కార్యదర్శి నాగమోహన్, అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి జగదీశ్, నాగరాజు, మెడికల్‌ కళాశాలల వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News