Homeజిల్లాలుకామారెడ్డిYeallreddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్​ల నియామకం

Yeallreddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్​ల నియామకం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallreddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో (Yella Reddy Government Hospital) ముగ్గురు గైనకాలజిస్టులను వైద్యారోగ్యశాఖ నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్​లు (Gynecologists) లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాన్ని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు (MLA Madan Mohan Rao) పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన సమీక్షలోనూ వైద్యుల కొరతపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వైద్యులను నియమించాలని కోరారు.

దీంతో స్పందించిన అధికారులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురు గైనకాలజిస్ట్​లను నియమించారు. వారానికి రెండురోజుల చొప్పున పనిచేసేలా ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.