Homeజిల్లాలునిజామాబాద్​Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ (college director Narala Sudhakar) ఒక ప్రకటనలో తెలిపారు.

ఇమార్టికస్ సహకారంతో హెచ్​డీఎఫ్​సీ, సిటీ యూనియన్, యాక్సిస్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో (ICICI Bank) శాశ్వత ప్రాతిపదికన పని చేసేందుకు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేలకు పైన జీతభత్యాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. 12న ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, ఏదైనా డిగ్రీ/ బీటెక్(Degree/B.Tech)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, 26 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.

వివరాలకు 9321825562 నంబర్​ను సంప్రదించాలని సూచించారు.