అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ఆరు రోజుల వరుస నష్టాలనుంచి తేరుకుని నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించింది. పీఎస్‌యూ, మెటల్, పవర్ సెక్టార్ల స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 162 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 74 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి.
మార్కెట్ స్థిరంగా పైకి వెళ్తోంది. సెన్సెక్స్(Sensex) 80,448 నుంచి 80,851 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,668 నుంచి 24,791 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 80,652 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 24,726 వద్ద ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లు(Global Markets) పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రాణిస్తున్నాయి. ఐటీ రంగం కోలుకుంటోంది.
జోరుమీదున్న పీఎస్‌యూ స్టాక్స్..
బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్(Oil and Gas), మెటల్ సెక్టార్ల షేర్లు జోరుమీదున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.84 శాతం పెరగ్గా.. ఎనర్జీ 1.41 శాతం, రియాలిటీ 1.38 శాతం, పీఎస్‌యూ, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 1.17 శాతం, పవర్ 0.91 శాతం, మెటల్ 0.86 శాతం, యుటిలిటీ 0.78 శాతం, ఇన్‌ఫ్రా 0.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.68 శాతం, ఐటీ 0.62 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.12 శాతం, బీఎస్‌ఈ సర్వీసెస్ 0.11 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.03 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.46 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 2.27 శాతం, ఎటర్నల్ 1.81 శాతం, సన్‌ఫార్మా 1.72 శాతం, టైటాన్ 1.54 శాతం, పవర్‌గ్రిడ్ 1.24 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 2.08 శాతం, మారుతి 1.19 శాతం, ఎల్‌టీ 0.54 శాతం, అదానిపోర్ట్స్ 0.48 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.32 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.