అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Bus | రాష్ట్రంలో ఆర్టీసీకి (RTC) ఆదరణ పెరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) ద్వారా మహిళకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. ఇటీవల రాఖీ పండుగ (Rakhi Festival) సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు.
RTC Bus | 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు
ఈ నెల 9న రాఖీ పండుగ ఉండగా.. పండుగకు ముందు, తర్వాత ఆరు రోజుల్లో ఏకంగా 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ప్రయాణించడం గమనార్హం. ఆగస్టు 7న మొత్తం 58.81 లక్షల మంది, 8న 57.53 లక్షలు, 9న 66.40 లక్షలు, 10న 56.70 లక్షలు, 11న 68.45 లక్షలు, 12న 60.30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. రాఖీ పండుగ నాడు 45.62 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించున్నారు. ఆగస్టు 11న అత్యధికంగా 45.94 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి టికెట్ ద్వారా ప్రయాణం చేశారు.
RTC Bus | స్పెషల్ బస్సుల పేరిట..
ఆర్టీసీ రాఖీ పౌర్ణమి సందర్భంగా స్పెషల్ బస్సుల (Special Bus) పేరిట భారీగానే దండుకుంది. రాఖీకి ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీ కడతారు. దీనికి తోడు ఈసారి మూడు రోజులు సెలవులు రావడంతో పిల్లలను తీసుకొని చాలా మంది మహిళలు సోదరల దగ్గరకు రాఖీ పండుగకు వెళ్లారు. దీంతో బస్టాండ్లు కిటకిటలాడాయి. రద్దీ అధికంగా ఉన్నా.. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు స్పెషల్ బస్సుల పేరిట సైతం ఆర్టీసీ భారీగా ఛార్జీలు వసూలు చేసింది. అయినప్పటికీ 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం గమనార్హం.