అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చి కూడా స్వామి దర్శనం చేసుకొని తరిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 14న రికార్డు స్థాయిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం 91,720 మంది యాత్రికులు తిరుమల దర్శనం చేసుకోవడం గమనార్హం. వేసవి సెలవుల రద్దీతో పాటు శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.
