ePaper
More
    HomeజాతీయంGST Collections | జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఐదేళ్లలో డబుల్​ అయిన కలెక్షన్లు

    GST Collections | జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఐదేళ్లలో డబుల్​ అయిన కలెక్షన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: GST Collections | దేశంలో గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో జీఎస్టీ (GST) వసూలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వసూళ్ల (GST Collections) వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఏకంగా రూ.22.08 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కావడం గమనార్హం.

    కేంద్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో బీజేపీ (BJP) దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017 జులై 1న గతంలో ఉన్న బహుళ పన్ను వ్యవస్థలో స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్​టీ(గూడ్స్​ సర్వీస్​ ట్యాక్స్​) అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుంది. అయితే పెట్రోల్​, మద్యంను మాత్రం ఇందులో నుంచి మినహాయించారు. తొలి ఏడాది రూ.10.79 లక్షల కోట్ల జీఎస్టీ వచ్చింది.

    GST Collections | ఐదేళ్లలో ఎంతో పురోగతి

    2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.11.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. 2024–25లో ఆ మొత్తం రూ.22.08 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే ఐదు ఏళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి నమోదు అయింది. కరోనా (Corona) సమయంలో తప్ప ప్రతి సారి జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ పోవడం గమనార్హం. 2025 ఏప్రిల్​లో రూ.2.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. మే నెలలో రూ.2.01 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయి.

    GST Collections | జీఎస్టీ వసూళ్ల వివరాలు..

    • 2017–18 : రూ.10.79 లక్షల కోట్లు
    • 2018–19 : రూ.11.77 లక్షల కోట్లు
    • 2019–20 : రూ.12.22 లక్షల కోట్లు
    • 2020–21 : రూ.11.91 లక్షల కోట్లు
    • 2021–22 : రూ.14.83 లక్షల కోట్లు
    • 2022–23 : రూ.18.08 లక్షల కోట్లు
    • 2023–24 : రూ.20.18 లక్షల కోట్లు
    • 2024–25 : రూ.22.08 లక్షల కోట్లు

    GST Collections | పెరిగిన పన్ను చెల్లింపుదారులు

    దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల (Tax Payers) సంఖ్య పెరిగింది. 2017లో పన్ను చెల్లింపుదారులు 65 లక్షల మంది ఉండగా 2025 నాటికి వారి సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది.

    Latest articles

    Singitham Project | సింగితం గేట్లు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Singitham Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి ఎగువ...

    Armoor | ఆర్మూర్​ మున్సిపల్​ కమిషనర్​కు అవార్డు

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) ఉత్తమ సేవలకు...

    Pavan Kalyan | ‘ఓటు చోరీ’ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. పవన్​ కల్యాణ్​​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఓటు చోరీ (Vote Chori) ఆరోపణల వెనక అంతర్జాతీయ కుట్ర...

    Harish Rao | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌న్నుల పోటు.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | పాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేస్తోందని...

    More like this