అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ఇటీవల రియల్టర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగంగా పెంచారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో సోమవారం ఉదయం రియల్టర్ వెంకటరత్నం హత్య జరిగింది. అందరు చూస్తుండగా నిందితులు తుపాకితో కాల్చి, కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు చందన్ సింగ్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
Hyderabad | ఆస్తుల కోసమే..
వెంకటరత్నంను చందన్ సింగ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చందన్ తండి సుదేశ్ సింగ్ దూల్‌పేట (Dulpeta)లో గుడుంబా దందా చేసి భారీగా ఆస్తులు సంపాదించాడు. అప్పుడు వెంకటరత్నం ఆయన దగ్గర డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో సుదేశ్ సింగ్ కొన్ని ఆస్తులను వెంకట రత్నం పేరిట కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుదేశ్ సింగ్ చనిపోయాడు. తన తండ్రి మరణానికి వెంకటరత్నం కారణమని చందన్ సింగ్ తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే అందుకు వెంకటరత్నం నిరాకరించాడు. దీంతో పగతో రగిలిపోయి తన సహచరులతో కలిసి హత్య చేశాడు.
కాగా చందన్ సింగ్ రెజ్లర్ కావాలని కలలు కన్నాడు. తన సోదరుడు లడ్డూ సింగ్ హత్యతో రౌడీ షీటర్‌గా మారాడు. తన తండ్రి ఆస్తుల కోసం ఇటీవల రియల్టర్ వెంకటరత్నంను హత్య చేశాడు. అయితే వీరు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తుపాకీ ఎక్కడిదనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.