Homeబిజినెస్​Realme 15 T | భారీ బ్యాటరీ, స్లిమ్‌ డిజైన్‌తో రియల్‌మీ ఫోన్‌

Realme 15 T | భారీ బ్యాటరీ, స్లిమ్‌ డిజైన్‌తో రియల్‌మీ ఫోన్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Realme 15 T | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ అయిన రియల్‌మీ.. మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. రియల్‌మీ 15టీ పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్‌ సేల్స్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభమయ్యాయి.

ప్లిప్‌కార్ట్‌(Flipkart), రియల్‌మీ ఇండియా ఇ-స్టోర్‌లలో అందుబాటులో ఉంది. రూ. 25 వేలలోపు ధరలో తీసుకువచ్చిన ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.57 ఇంచెస్‌ 4R కంఫర్ట్‌ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌ 4000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 10 బిట్‌ కలర్‌డెప్త్‌, 2160Hz పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌, 93 శాతం స్క్రీన్‌ టు బాడీ రేషియోకు మద్దతు ఇస్తుంది. IP 66, 68, 69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్‌ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ చిప్‌సెట్‌తో తీసుకువచ్చారు.

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌(Operating System)తో పనిచేస్తుంది. మూడేళ్లపాటు ఓఎస్‌ అప్‌గ్రేడ్స్‌, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఏఐ ఫీచర్స్‌ : AI ఎడిట్‌ జీనీ, ఏఐ స్పాప్‌ మోడ్‌, ఏఐ ల్యాండ్‌స్కేప్‌ తదితర ఏఐ ఫీచర్లున్నాయి.

బ్యాటరీ : 7000 mAh భారీ బ్యాటరీతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌.. 60 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌, 10 డబ్ల్యూ రివర్స్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. భారీ బ్యాటరీతో తీసుకువచ్చినా ఇది 7.79 అంగుళాల మందం, 181 గ్రాముల లైట్‌ వెయిట్‌ మాత్రమే ఉంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ మోడ్‌లో 31 నిమిషాలలో 50 శాతం చార్జింగ్‌ అవుతుందని కంపెనీ పేర్కొంది.

కెమెరా : 50 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్‌ రేర్‌ కెమెరా(Camera) సెటప్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరా ఉంది. ముందు, వెనక కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్‌ చేస్తాయి.

కలర్స్‌ : ఫ్లోయంగ్‌ సిల్వర్‌, సిల్క్‌ బ్లూ, సూట్‌ టైటానియం.

వేరియంట్స్‌ : 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 20,999.
8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 22,999.
12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 24,999.
కార్డ్‌ ఆఫర్స్‌ : ఫస్ట్‌ సేల్‌ సెప్టెంబర్‌ 6 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలనుంచి 8వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంస్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ. 2 వేల వరకు తక్షణ డిస్కౌంట్‌ లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ(SBI) బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.