అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme P4 Lite Launch | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ అయిన రియల్మీ భారత మార్కెట్లో మరో మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ధరలో రియల్మీ పీ4 లైట్ పేరుతో దీనిని తీసుకువస్తోంది. ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఉంది. బేస్వేరియంట్ ధర రూ. 10 వేలలోపు ఉండే అవకాశాలు ఉన్నాయి.
డిస్ప్లే : 6.74 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అమర్చారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1600 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
సాఫ్ట్వేర్ : యునిసాక్ టీ7250 ప్రాసెసర్‌తో తీసుకువస్తున్న ఈ మోడల్ ఫోన్.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 6300 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 15 వాట్ చార్జింగ్, 6 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : సీ బ్లూ, బీచ్ గోల్డ్, ఓబిసిడియన్ బ్లాక్ కలర్స్‌లో, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనుంది.