అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme gt 7 | స్మార్ట్ ఫోన్ (Smart Phone) రంగంలో రోజు రోజుకి సరికొత్త మోడల్స్ పుట్టుకొస్తున్నాయి. బ్యాటరీ, కెమెరా, ఇతర టెక్నికల్ విషయాలలో (battery, camera and other technical aspects) కూడా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బిగ్ బ్యాటరీలపై ఫోకస్ (smart phone companies focused on big batteries) చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తమ స్మార్ట్ఫోన్లకు 6000mAh, 6500mAh, 7000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను అందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నింటినీ మించి ఇప్పుడు రియల్‌మీ ఏకంగా 10,000mAh బ్యాటరీతో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ (realme anounced new smart phone with 10,000MAH battery) అయ్యారు.
రియల్‌మీ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సిరీస్‌ను ‘రియల్‌మీ GT 7’ (relame GT7) పేరుతో తీసుకురానుంది. ఈ మేరకు తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ టీజర్‌ను (upcoming smartphone Teaser) కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ద్వారా రిలీజ్ చేసింది. గత నెలలో చైనాలో దీనిని విడుదల చేయగా, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా దీనిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ (planing for release on india markets) చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ పోస్ట్‌లో రియల్‌మీ ఇండియా “పవర్ దట్ నెవర్ స్టాప్స్” (power the never stop) అనే ట్యాగ్‌లైన్‌ను జోడించింది. అమెజాన్‌లో (amezon) కూడా ఈ ఫోన్ లాంఛ్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను విడుదల చేశారు.
అప్‌కమింగ్ ఫోన్‌లు 6 గంటల వరకు 120 fps BGMI గేమ్‌ప్లేను అందించగలవని రియల్‌మీ పేర్కొంది. ‘రియల్‌మీ GT 7’ సిరీస్ (realme GT7 series) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. భారతదేశంలో అతి త్వరలోనే వీటి లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. మినీ డైమండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ వల్ల పది వేల ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్‌లో (10,000MAH battery smartphone) అమర్చడానికి సాధ్యపడిందని రియల్ మీ ప్రతినిధులు చెబుతున్నారు. భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్లను వివో సబ్-బ్రాండ్ కంపెనీ ఐక్యూ (indias biggest battery phone vivo sub brand IQOO) ఇటీవలే విడుదల చేసింది. ఆ ఫోన్ పేర్లు ‘iQOO Z10’, ‘iQOO Z10x’. ఈ రెండు బడ్జెట్ ఫోన్లలో కంపెనీ 7300mAh బ్యాటరీని అందించింది. దీని లాంచ్ సమయంలో అతి పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌గా దీనిని అభివర్ణించింది. ఇప్పుడు రియల్‌మీ ఏకంగా 10000mAh బ్యాటరీ సామర్థ్యంతో కొత్త ఫోన్‌ను రెడీ చేస్తుండడంతో అందరు షాక్ అవుతున్నారు.