అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చైనాతో ఘర్షణపై ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పు పట్టింది. నిజమైన భారతీయులు అలాంటి వ్యాఖ్యలు చేయరని పేర్కొంది.
భారత్ – చైనా సైనికుల మధ్య గతంలో గాల్వాన్ లోయలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 2022 డిసెంబర్లో భారత భూభాగంలోలోకి చొచ్చుకు వచ్చిన చైనా సైనికులు (Chinese Soldiers) భారత జవాన్లు నిలువరించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు సైనికులు మృతి చెందారు. అయితే గాల్వాన్ ఘటన సందర్భంగా చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూ భాగాన్ని ఆక్రమించిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. చైనా దాడి చేసి భారత సైనికులను చంపేస్తోందన్నారు. భారత సైన్యం (Indian Army) పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
Supreme Court | పార్లమెంట్లో మాట్లాడండి..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 29న అలహాబాద్ హైకోర్టు రాహుల్‌గాంధీకి ఈ పిటిషన్‌పై సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా భారత భూ భాగాన్ని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని కోర్టు ప్రశ్నించింది. ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. రాహుల్ నిజమైన భారతీయుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని కోర్టు పేర్కొంది. దేశ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని కోర్టు సూచించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పు పట్టిన కోర్టు ఆయనపై పరువు నష్టం కేసును నిలిపివేసింది.