HomeతెలంగాణRERA | రియల్​ ఎస్టేట్​ సంస్థలకు రెరా షాక్​.. పలు కంపెనీలకు భారీ జరిమానా

RERA | రియల్​ ఎస్టేట్​ సంస్థలకు రెరా షాక్​.. పలు కంపెనీలకు భారీ జరిమానా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RERA | తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) పలు రియల్​ ఎస్టేట్​ సంస్థలపై కొరఢా ఝుళిపించింది.

ప్రాజెక్ట్ అక్రమాలు, మోసపూరిత పద్ధతులు, గృహ కొనుగోలుదారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానాలు వేసింది. పలువురు బాధితులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టింది.


బొల్లారం నివాసి మెర్సీ థంకచన్ (Mercy Thankachan), 2021 జనవరిలో తాను బుక్ చేసుకున్న ఫ్లాట్‌ను బిల్డర్ అప్పగించడంలో విఫలమైన తర్వాత భువంటేజా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌పై (Bhuvanteja Infra Projects) భారీ విజయాన్ని సాధించారు. పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఆమె అనుమతి లేకుండా తన బుకింగ్ ‘హ్యాపీ హోమ్స్ 1’ (‘Happy Homes 1) అనే వేరే ప్రాజెక్ట్‌కు మారింది. అంతే గాకుండా ఫ్లాట్​ కోసం అదనంగా డబ్బులు చెల్లించాలని సదరు సంస్థ డిమాండ్​ చేసింది. దీంతో బాధితురాలు రెరాను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన రెరా 11 శాతం వడ్డీతో పూర్తి మొత్తాన్ని ఆమెకు తిరిగి చెల్లించాలని బిల్డర్​ను ఆదేశించింది. కొనుగోలుదారుని తప్పుదారి పట్టించినందుకు బ్రోకర్ దేవాస్ ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు జరిమానా విధించాలని అథారిటీ ఆదేశించింది.

RERA | ప్రాజెక్ట్​ నిలిపివేయాలని ఆదేశాలు

శ్రీవారి బృందావన్ ప్రాజెక్ట్‌లో (Srivari Brindavan project) కొనసాగుతున్న కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని TGRERA ఆదేశించింది. ఫిబ్రవరి 2023, మే 2024 మధ్య ఆస్తి అప్పగింతలు షెడ్యూల్ చేయబడినప్పటికీ, నిర్మాణం 35 శాతం వద్ద నిలిచిపోయిందని కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు గతంలో విధించిన మధ్యంతర పరిమితులను ఉల్లంఘించి యూనిట్లను అమ్మడం కొనసాగించారని గృహ కొనుగోలుదారులు ఆరోపించారు. జూలై 11న తదుపరి విచారణకు బిల్డర్ కొనుగోలుదారుల పూర్తి జాబితా, ఆర్థిక పత్రాలతో (financial documents) హాజరు కావాలని రెరా ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి లావాదేవీలు చేపట్టొద్దని సూచించింది. అలాగే జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని వాటర్ ఫ్రంట్ విల్లాస్ డెవలపర్లను అధికారులు ఆదేశించారు.

RERA | వివాదాలు దాచిపటెట్ఇ

అవిన్యా అవెన్యూస్‌కు (Avinya Avenues) సంబంధించిన కేసులో ప్రాజెక్ట్ ప్రమోటర్లు భూమి యాజమాన్యంపై కీలకమైన చట్టపరమైన వివాదాన్ని దాచిపెట్టారని RERA గుర్తించింది. అనుజ్ రాజ్ దాఖలు చేసిన ఫిర్యాదులో ఆ భూమి మొదట తన తాత దివంగత శివరాజ్ బహదూర్​కు చెందిందని, 1990లలో మోసపూరితంగా ప్రస్తుత ప్రమోటర్లలో ఒకరి తండ్రి దివంగత సి మల్లారెడ్డి పేరుకు బదిలీ చేయబడిందని పేర్కొన్నారు. ఈ విషయం సబ్ జ్యుడీస్‌లో ఉన్నప్పటికీ.. బిల్డర్లు కొనుగోలుదారులకు తెలియజేయకుండా నిర్మాణం చేపట్టి అమ్మకాలను కొనసాగించారు. దీంతో ఆ సంస్థపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన కేసుల గురించి కస్టమర్లకు అధికారికంగా తెలియజేయాలని ఆదేశించింది.