HomeUncategorizedSushila Karki | తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీ.. నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌న్న సుశీల క‌ర్కి

Sushila Karki | తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీ.. నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌న్న సుశీల క‌ర్కి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sushila Karki | నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని జెన్‌-జి చేసిన‌ ప్రతిపాదన‌కు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి(Sushila Karki) అంగీక‌రించారు. జాతీయ ప్రయోజనాల కోసం పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

71 ఏళ్ల కార్కి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్(Nepal) యువత తనపై చూపిన నమ్మకంతో తాను ఉప్పొంగిపోయానన్నారు. “జనరల్-జి గ్రూప్ స్వల్ప కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపించడానికి నన్ను విశ్వసించింది. నేను జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.

Sushila Karki | ఆర్మీ చీఫ్‌తో భేటీ..

ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చించేందుకు జెన్‌-జి(Gen-G) ప్రతినిధులు ఆర్మీ చీఫ్‌ను కలవనున్నారు. తాత్కాలిక ప్రభుత్వ నాయకత్వంపై చ‌ర్చించ‌నున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి కొత్త ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును ఇప్ప‌టికే ఖరారు చేశారు. ఇందులో ఇంకా కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ, ఆర్మీ చీఫ్‌తో సమావేశం ప్రారంభమయ్యే ముందు, జనరల్-జి ఆందోళనకారులలో ఈ పేరుపై ఏకాభిప్రాయం కుదిరిపోతుందని, ఆపై ఆర్మీ చీఫ్‌(Army Chief)తో చర్చించిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
నేపాల్ భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియాపై విధించిన నిషేధంతో మొద‌లైన నిర‌స‌న‌ల వెల్లువ అవినీతి, బంధుప్రీతి వ్య‌తిరేక ఉద్య‌మంగా మారింది. వేలాది మంది విద్యార్థులు, యువ‌కులు రోడ్లెక్కి విధ్వంసం సృష్టించారు. దీంతో ప్ర‌ధాని శ‌ర్మ ఓలి(Prime Minister Sharma Oli) స‌హా మంత్రులు రాజీనామా చేయ‌డంతో ప్ర‌భుత్వం కూలిపోయింది. అయిన‌ప్ప‌టికీ శాంతించని విద్యార్థులు పార్ల‌మెంట్‌, సుప్రీంకోర్టుతో పాటు అధ్య‌క్షుడు, ప్ర‌ధాని, మంత్రుల ఇళ్ల‌కు నిప్పుపెట్టారు. వీధుల్లో వీరంగం వేస్తూ మంత్రులు, మాజీ మంత్రుల‌పై దాడులకు పాల్ప‌డ్డారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోకి చొర‌బ‌డి లూటీ చేశారు.

Must Read
Related News