అక్షరటుడే, ఇందూరు : Local Body Elections | రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ (Hyderabad) నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఈ నెల 9న నిజామాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 18 జెడ్పీటీసీలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Local Body Elections | కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ (Reception of nominations) ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రక్రియ జరపాలన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, ఓటర్ల జాబితా నిర్వహణ సక్రమంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో వీడియో తీయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి తదితరులు పాల్గొన్నారు.