అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan War : జమ్మూకశ్మీర్‌లోని పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ underground బంకర్ల bunkers నిర్మాణాన్ని భారత్ వేగవంతంగా చేపడుతోంది.
ఏప్రిల్ 22న పహల్గావ్ ఉగ్రదాడి Pahalgaon terror attack అనంతరం జమ్మూకశ్మీర్ Jammu Kashmir లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించడానికి భారత్ యుద్ధ ప్రాతిపదికన బంకర్ల నిర్మాణం చేపడుతున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.
పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా Samba district లోనూ ప్రజలు అప్రమత్తం అయ్యారు. భారత్ – పాక్ యుద్ధం జరగొచ్చనే ఆందోళనతో ఇక్కడి రామ్‌గఢ్ గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధమంటూ జరిగితే తమ ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవడానికి గ్రామంలో భూగర్భ బంకర్ల నిర్మాణం చేపడుతున్నారు.
గతంలోనూ భారత్ – పాక్ యుద్ధాలు జరిగిన సమయంలో జమ్మూకశ్మీర్‌లో వందలాది కుటుంబాలు బంకర్లను నిర్మించుకుని, అందులోనే తలదాచుకున్నాయి. తాజాగా మరోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తత నెలకొనడంతో మళ్లీ అలాంటి బంకర్ల నిర్మాణం కొనసాగుతోంది.