Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Police | పేకాటకు రంగం సిద్ధం: కట్టడి చేస్తామంటున్న పోలీసులు

Nizamabad Police | పేకాటకు రంగం సిద్ధం: కట్టడి చేస్తామంటున్న పోలీసులు

దీపావళికి పేకాట ఆడేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఏడాది పేకాట ఆడకుండా కట్టడి చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Police | దీపావళి పండుగ (Diwali Festival) వచ్చిందంటే చాలు జోరుగా పేకాట సాగుతుందనేది బహిరంగ రహస్యం. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాపారులు తమ దుకాణాల్లో లక్ష్మి పూజలు చేస్తుంటారు.

ఈ క్రమంలో రాత్రి మొత్తం దుకాణాల వద్దే జాగరణ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు కాలక్షేపం కోసం పేకాడుతూ, ఇదే అలవాటుగా మార్చుకుంటున్నారు. దీపావళికి మూడు రోజుల నుంచి పేకాడడం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో (Nizamabad Joint Districts) అలవాటుగా మారింది. పోలీసులు పేకాటపై ఛాలెంజ్‌గా వ్యవహరిస్తూ, నిఘా కట్టుదిట్టం చేశారు. అయినా.. ఏటా పేకాట పరిపాటిగా మారింది.

Nizamabad Police | స్థావరాలు సిద్ధం..

దీపావళి సందర్భంగా రెండురోజుల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ఫామ్‌ హౌజులు (Farm House), లాడ్జీల్లో (Lodges) పేకాట స్థావరాలు వెలిశాయి. ఇప్పటికే చాలాచోట్ల పేకాట మొదలైంది. పేకాటరాయుళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా. పేకాటరాయుళ్లు ఏమాత్రం జంకడం లేదు. బడాబాబుల అండదండలతో పేకాట మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు.

Nizamabad Police | పేకాడితే అరెస్ట్‌..

– రాజా వెంకటరెడ్డి, ఏసీపీ

పేకాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశాం. పోలీసు సిబ్బందిని సైతం అప్రమత్తం చేశారు. పేకాడుతూ పట్టుబడితే చట్టరీత్యా కఠిన చర్యలుంటాయి. ఎక్కడైనా పేకాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.