అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fire Accident | హైదరాబా(Hyderabad)ద్ నగర శివారులో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 10 మంది మృతి చెందగా, 20 మంది వరకు గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీ(Sigachi Chemical Industry)లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో అక్కడ పని చేస్తున్న పలువురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మంటల తీవ్రతకు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 11 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Fire Accident | భారీగా ఎగిసిన మంటలు..
సోమవారం ఉదయం కెమికల్స్ పరిశ్రమలోని రియాక్టర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డారు. మంటల్లో ఏడెనిమిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని , మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కొందరు కార్మికులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే, పొగలు దట్టంగా వ్యాపించడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
Fire Accident | హుటాహుటిన సహాయక చర్యలు..
భారీ శబ్ధంతో ఉవ్వెత్తున ఎగిసన మంటలతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నల్లటి పొగ దట్టంగా కమ్మేయడంతో అక్కడేం జరుగుతున్నందన్నది ఎవరికి కొద్దిసేపు అంతుబట్టలేదు. భారీ అగ్ని ప్రమాదం(Major Fire Accident)తో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురికాగా, అధికారులు వారిని అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. మరోవైపు, సమాచారమందుకున్న ఫైరింజన్లు హుటాహుటిన రంగంలోకి దిగాయి. 11 ఫైరింజన్లు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇక, పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు(NDRF Teams) సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మల్టీ జోన్ టు ఐజీ సత్యనారాయణ, ఎస్పీ పరితోష్ పంకజ్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.