ePaper
More
    Homeక్రీడలుipl 2025 | ధోని మ‌రోసారి జిడ్డు బ్యాటింగ్ చేసి సీఎస్కేని ఓడించాడుగా.. ప్లే ఆఫ్...

    ipl 2025 | ధోని మ‌రోసారి జిడ్డు బ్యాటింగ్ చేసి సీఎస్కేని ఓడించాడుగా.. ప్లే ఆఫ్ చేరిన తొలి జ‌ట్టు ఏది అంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ipl 2025 | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో Chinnaswamy Stadium జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా ఆర్సీబీ RCB, సీఎస్‌కే CSK మ‌ధ్య 52వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు Bangalore జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని కూడా సీఎస్‌కే CSK సులువుగా చేదిస్తుంది అని అంద‌రు అనుకున్నారు. కాని పూర్తి ఓవర్లు ఆడిన తర్వాత 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. 214 పరుగుల భారీ లక్ష్యచేధనలో షేక్ రషీద్ Sheikh Rashid (14), సామ్ కరన్ Sam Curran (5) విఫలమైనా.. ఆయుషే మాత్రే Ayush Mathre, జడేజా jadeja విధ్వంసకర బ్యాటింగ్‌తో batting చెలరేగారు. మూడో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం partnership నెలకొల్పారు.

    ఆయుషే మాత్రే Ayush Mathre సెంచరీకి చేరువ‌వుతున్న స‌మ‌యంలో రవీంద్ర జడేజా Ravindra Jadeja హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇచ్చిన నాలుగు సునాయస క్యాచ్‌లను ఆర్‌సీబీ ఆటగాళ్లు RCB players వదిలేయ‌డంతో సీఎస్‌కే విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ లుంగి ఎంగిడి 17వ ఓవర్‌‌లో వరుసగా ఆయుష్ మాత్రే Ayush Mathre, డెవాల్డ్ బ్రేవిస్ Dewald Brevis (0)లను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్‌లో last over సీఎస్‌కే విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. యశ్ దయాల్ Yash Dayal తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ధోనీని ఎల్బీగా ఔట్ dismissed Dhoni చేశాడు. నాలుగో బంతిని బీమర్‌గా వేయడంతో శివమ్ దూబే Shivam Dubey భారీ సిక్సర్ బాదాడు. ఇది నోబాల్ noball కావడంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి.

    కట్టడిగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ Yash Dayal మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 8 బంతులాడిన ధోనీ Ms Dhoni ఒక సిక్స్‌తో 12 పరుగులే చేశారు. అత‌ను కాస్త దూకుడిగా ఆడి ఉంటే సీఎస్‌కే విజ‌యం సాధించేది. అయితే నువ్వా నేనా అన్న‌ట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ RCB విజ‌యం సాధించడంతో ప్లే ఆఫ్ pla off చేరిన తొలి జ‌ట్టుగా నిలిచింది. ఈ సారైన ఆర్సీబీ క‌ప్ సాధించాల‌ని ఫ్యాన్స్ Fans ఎంత‌గానో కోరుకుంటున్నారు.

    Latest articles

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    More like this