RCB trending on social media | సోషల్​ మీడియాలో ఆర్​సీబీ ట్రెండింగ్​.. ఎక్స్‌లో పోస్టులన్నీ అవే..
RCB trending on social media | సోషల్​ మీడియాలో ఆర్​సీబీ ట్రెండింగ్​.. ఎక్స్‌లో పోస్టులన్నీ అవే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RCB trending on social media : ఐపీఎల్​ 2025(IPL 2025) ఫైనల్​లో రాయల్​ ఛాలెంజ్​ బెంగళూరు(oyal Challengers Bangalore) విజయంతో సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. నెటిజన్లు(Netizens) ఆర్​సీబీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సాలా కప్​ నమ్డే అంటూ ఆర్​సీబీ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఎక్స్(ట్విటర్​) X (Twitter)లో అయితే పోస్టులన్నీ ఆర్​సీబీవే ఉండటం గమనార్హం. అటు ఫేస్​బుక్​లోనూ బెంగళూరు జట్టు(Bengaluru team) పోస్టులతో నిండిపోయాయి.

సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోషల్​ మీడియా వేదికగా బెంగళూరు జట్టు ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక, బెంగళూరు యువత తమ జట్టు ఆటగాళ్లపై ఎక్స్ లో నిలువెత్తు అభిమానం చాటుతున్నారు.

పద్దెనిమిదేళ్ల బెంగళూరు జట్టు కల ఓ వైపు ఎట్టకేలకు నెరవేరగా.. పంజాబ్​ జట్టు(Punjab team) 18 ఏళ్ల కల మాత్రం తృటిలో చేజారిపోయింది. ఆ జట్టును గెలిపించేందుకు శశాంక్​ యాదవ్​ చివరి వరకు పోరాడాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.