ePaper
More
    Homeక్రీడలుRcb player | చిక్కుల్లో ఆర్సీబీ ప్లేయ‌ర్.. పెళ్లి పేరుతో యువ‌తిని మోసం చేశాడా..!

    Rcb player | చిక్కుల్లో ఆర్సీబీ ప్లేయ‌ర్.. పెళ్లి పేరుతో యువ‌తిని మోసం చేశాడా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rcb player | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌల‌ర్, యువ పేసర్ యశ్ దయాల్ చిక్కుల్లో ప‌డ్డాడు. ఉత్తరప్రదేశ్‌కి (Uttar Pradesh) చెందిన ఓ యువతి, అతనిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీఎంఓకి ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్‌కి చెందిన బాధితురాలు, “యశ్ దయాల్ (Yash Dayal) నన్ను పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి గత ఐదేళ్లుగా మోసం చేశాడు. ప్రేమ పేరుతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నన్ను ఇబ్బందుల‌కి గురి చేశాడు అంటూ ఆరోపించింది. తనను కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడని తెలిపింది. ఈ ఆరోపణలతో యశ్ దయాల్‌పేరు హాట్ టాపిక్‌గా మారింది.

    Rcb player | లేనిపోని స‌మ‌స్య‌లు..

    తన వద్ద యశ్‌తో సంభాషణలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, ఫోటోలు, వీడియో కాల్స్ (Video Calls), చాట్ రికార్డులు వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా స‌ద‌రు యువ‌తి స్పష్టం చేసింది. ప్రేమలో (Love) ఉన్న సమయంలో డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపించింది. అంతేకాదు, యశ్ గతంలో మరికొంతమంది యువతులను కూడా మోసం చేశాడన్న సమాచారం తనకు ఉందని చెప్పుకొచ్చింది. ఈ నెల 14న మహిళా హెల్ప్‌లైన్‌కి కాల్ చేసినప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station) నుంచి ఎటువంటి స్పందన రాలేదని బాధితురాలు వాపోయింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరకు నేరుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వివరించింది.

    ఈ ఫిర్యాదుపై ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయం (Uttar Pradesh CM office) స్పందించి, ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. జూలై 21వ తేదీ లోగా పూర్తి నివేదికను సమర్పించాలంటూ సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలు యశ్ దయాల్( Yash Dayal) వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్ కెరీర్‌పై (Cricket Carrer) ప్రభావం చూపే అవకాశముంది. బాధితురాలి చెప్పిన ఆధారాలు వాస్తవంగా మారితే, కేసు తీవ్రస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎటు వైపుకు దారి తీస్తుందో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్సీబీ త‌ర‌పున అత్యుత్త‌మ బౌల‌ర్‌గా య‌ష్ ద‌యాల్‌కి మంచి రికార్డ్ ఉంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this