ePaper
More
    HomeజాతీయంRCB Stampede | క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న రిపోర్ట్.. తొక్కిస‌లాట‌కు ఆర్సీబీనే కార‌ణం..!

    RCB Stampede | క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న రిపోర్ట్.. తొక్కిస‌లాట‌కు ఆర్సీబీనే కార‌ణం..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: RCB Stampede | జూన్ 4న, బెంగళూరులో ఎం.చిన్న‌స్వామి స్టేడియం బయట ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా సంభవించిన తొక్కిస‌లాట‌లో 11 మంది చనిపోవడం, సుమారు 50 మంది గాయపడ‌టం దేశవ్యాప్తంగా క‌ల‌కలం రేపింది.

    ఈ కేసుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక రిపోర్టు తయారు చేయ‌గా, ఇందులో విజయోత్సవ ర్యాలీని పోలీసులను సంప్రదించకుండా, అనుమతులు తీసుకోకుండా ఆర్సీబీ యాజమాన్యం ఏకపక్షంగా నిర్వహించిందని పేర్కొంది. “ఉచిత పాస్‌లు ఇస్తున్నాం అంటూ ప్ర‌క‌టన చేయ‌డంతో సదరు ఈవెంట్‌కు 3 లక్షల మందికి పైగా ఆడియన్స్ స్టేడియంకు వచ్చారని నివేదికలో క్లారిటీ ఇచ్చింది.

    RCB Stampede | ఆర్సీబీదే త‌ప్పు..

    అవసరమైన అనుమతులు తీసుకోకుండా పెద్ద స్థాయిలో ప్రచారం చేయడం వల్లే ఈ దుర్ఘటనకు దారితీసిందని సిద్ధ‌రామయ్య (Karnataka CM Siddaramaiah) ప్ర‌భుత్వం నిందించింది. తగిన ప్రణాళికలు లేకపోవడం, అధికారులకు ముందు సమాచారం ఇవ్వకపోవడం కారణంగా ప్రమాదానికి దారితీసిందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో నివేదిక సమర్పించ‌గా, ఈ రిపోర్డును గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించ‌డం జ‌రిగింది. ఈ నివేదిక గోప్యతకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవంటూ స్ప‌ష్టం చేసింది. అంతేకాక ప్రభుత్వం సమర్పించిన రిపోర్టును కోర్టు ఆదేశాల మేరకు బహిరంగంగా విడుదల చేశారు.

    విజయోత్సవ పరేడ్‌ (Victory Parade) కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏడు రోజుల ముందు అనుమతులు తీసుకోవాలి. కానీ అలా చేయ‌లేదు. విజ‌యం అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం అందించ‌కుండానే ఆర్సీబీ త‌మ సోష‌ల్ మీడియా (Social Media)లో విక్ట‌రీ ప‌రేడ్ గురించి పోస్ట్ పెట్టారు. వేడుకకు ప్ర‌వేశం ఉచితం అని ప్ర‌క‌టించారు. అంతేకాదు విరాట్ కోహ్లీ వీడియో కూడా ఒక‌టి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో విజ‌యాన్ని బెంగ‌ళూరు ప్ర‌జ‌లు, ఆర్సీబీ అభిమానుల‌తో క‌లిసి జరుపుకోవాల‌ని ఉందని కోహ్లీ అన్నాడు అంటూ నివేదిక‌లో తెలియ‌జేశారు. RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే (RCB Marketing Head Nikhil Sosale), మరియు DNA ఈవెంట్ భాగస్వామ్య సంస్థ టాప్‌మెన్లపై FIR నమోదైంది. వారికి హైకోర్టు (High Court) బెయిల్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ట్రిబ్యునల్, హైకోర్టు విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...