ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ఆర్సీబీ Vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ వేదిక మార్పు.. కార‌ణం ఏంటంటే..!

    IPL 2025 | ఆర్సీబీ Vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ వేదిక మార్పు.. కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 తుది ద‌శ‌కు చేరుకుంది. ప్లే ఆఫ్స్‌కి (play offs) చేరుకునే మూడు జ‌ట్లు క‌న్‌ఫం అయ్యాయి. నాలుగో జ‌ట్టు ఏమై ఉంటుందా అనే స‌స్పెన్స్ ఉంది. మ‌రోవైపు భార‌త్ పాక్ యుద్ధ ప‌రిస్థితుల త‌ర్వాత వేదిక‌లు మారుతున్నాయి. మే 23న‌ చిన్న‌స్వామి స్టేడియంలో (chinnaswamy stadium) జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ ల‌క్నోకు త‌ర‌లించింది(BCCI shifted to luckonow). ఆతిథ్య రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్టు ఆ రోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో త‌ల‌ప‌డాల్సింది. అయితే.. వ‌రుణుడి ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ కావ‌డంతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దాంతో, బెంగ‌ళూరు అభిమానులు ఒకింత ఆందోళ‌న చెందుతున్నారు. ‘అయ్యో.. సొంత‌గ‌డ్డ‌పై త‌మ జ‌ట్టు ఆట‌ను చూడాలేక‌పోతున్నాం’ అని వాపోతున్నారు.

    IPL 2025 | ఎందుకు మార్చారు..

    షెడ్యూల్ ప్ర‌కారం మే 23న ఆర్సీబీ (RCB), ఆరెంజ్ ఆర్మీ (Orange Army) జ‌ట్లు చిన్న‌స్వామిలో త‌ల‌ప‌డాల్సింది. ఇప్ప‌టికే బెంగ‌ళూరు అభిమానులు (Bengaluru fans) టికెట్లు కొనుకున్నారు కూడా. అయితే.. ఐపీఎల్ పున‌రుద్ధ‌ర‌ణ త‌ర్వాత మే 17న జ‌రిగాల్సిన‌ తొలి మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. మొన్నామ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అయితే వ‌ర్షం కార‌ణంగా టాస్ కూడా వేయ‌కుండానే మ్యాచ్‌ను స‌స్పెండ్ (match suspend) చేస్తున్న‌ట్టు రిఫ‌రీలు తెలిపారు. దాంతో, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) దిగాలుగా టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

    అందుకే ఏమో లీగ్ ద‌శ‌లో మ‌రొక మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావొద్ద‌నే ఉద్దేశంతో బీసీసీఐ ల‌క్నోలోని అటల్ బిహార్ వాజ్‌పేయి మైదానంను (Atal Bihar Vajpayee Stadium) ఎంపిక చేసింది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ చేరుకున్న ర‌జ‌త్ పాటిదార్ (rajat Patidar) బృందం.. విజ‌యంతో నాకౌట్ పోరుకు వెళ్లాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక చివ‌రిగా ఎస్ఆర్ హెచ్ మంచి ఫామ్‌లోకి వ‌చ్చి అద్భుత విజ‌యం సాధించింది. దీంతో ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ (RCB – SRH) మ‌ధ్య ఫైట్ గ‌ట్టిగానే ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this