Bengaluru Stampede
Bengaluru Stampede | బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. తొలి అరెస్ట్‌గా ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Stampede | బెంగళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలేను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన 2025 జూన్ 4న చినస్వామి స్టేడియం వద్ద జరిగిన RCB విజయ పరేడ్ సందర్భంగా చోటుచేసుకుంది. ఈ పరేడ్‌లో 11 మంది మరణించగా, 75 మందికి పైగా గాయాలయ్యాయి. నిఖిల్ సొసలే DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్నారు. పోలీసులు ఆయనను బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు.

Bengaluru Stampede | ఫ‌స్ట్ ఎవ‌రు అరెస్ట్ అంటే..

ఈ ఘటనపై FIR నమోదు అయ్యింది. ఆర్సీబీ, ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ)ల‌ను నిందితులుగా చేర్చారు. KSCA కార్యదర్శి, కోశాధికారి పరారీలో ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు వారి ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ వారు లేన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) చర్యలు తీసుకున్నారు. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ B.దయానంద్‌ను సస్పెండ్ చేసి, RCB, KSCA, DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ నిర్వాహకుల అరెస్టుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ యాజమాన్యం గానీ, నిఖిల్ సోసాలే Nikhil sosale కుటుంబ సభ్యులు గానీ ఈ అరెస్టుపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఆర్సీబీ, విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పాటు ప‌లువురు క్రీడాకారులు స్పందించారు. ఆర్సీబీ మృతుల కుటుంబాల‌కి 10లక్ష‌ల రూపాయ‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.