HomeUncategorizedRCB | ఐపీఎల్ విజేత కాగానే ఆర్సీబీ కొత్త నిర్ణ‌యం.. అమ్మకానికి పెట్ట‌బోతున్నారా..?

RCB | ఐపీఎల్ విజేత కాగానే ఆర్సీబీ కొత్త నిర్ణ‌యం.. అమ్మకానికి పెట్ట‌బోతున్నారా..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: RCB | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్యంత ప్ర‌జాదర‌ణ ఉన్న జ‌ట్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) ఒక‌టనే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ జట్టుకు సోషల్ మీడియాలో (Social Media) కూడా విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఈ ఏడాది ఐపీఎల్ (IPL) విజేత‌గా నిలిచింది ఆర్సీబీ. ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడ‌డంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు, అభిమానుల ఆనందానికి హద్లులు లేకుండా పోయాయి. కాక‌పోతే ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న కాస్త ఆటగాళ్ల‌ని నిరుత్సాహానికి గురి చేసింది. అయితే.. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్ర‌యించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

RCB | ఆర్సీబీ అమ్మ‌కం..

కొత్త కేప్టెన్ రజత్ పటిదార్(Rajat Patidar) సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది ఆర్సీబీ. ఐపీఎల్ 2025 ఫైనల్స్​లో పంజాబ్ కింగ్స్​ను మట్టికరిపించి.. జయకేతనాన్ని ఎగురవేసింది. అయితే ఇప్పుడు ఆర్సీబీకి సంబంధించి కొన్ని వార్త‌లు షాకింగ్‌గా మారాయి. విజయ్ మాల్యా ఏర్పాటు చేసిన యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీతో(United Spirits Company) కలిసి ఆర్సీబీలో (RCB) భాగస్వామిగా ఉంటోన్న డైజియో.. ఫ్రాంఛైజీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టులో ఉన్న తన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా తన భాగస్వామ్య హక్కుల వాల్యుయేషన్ కూడా పూర్తి చేసింది డైజియో పీఎల్సీ. దాదాపుగా రెండు బిలియన్ డాలర్లకు (two billion dollars) వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.

ఆర్సీబీ అమ్మకానికి అవకాశం ఉందనే వార్తలు వెలువడడంతో.. యునైటెడ్ స్పిరిట్స్ షేర్లకు కూడా సెంటిమెంట్లు ఊతమిచ్చాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధరలు(stock prices) 3.3% వరకు పెరిగాయి. అయితే ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకులేద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 2008లో ఆర్‌సీబీ జ‌ట్టును కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ య‌జ‌మాని విజ‌య్ మాల్యా(Vijay mallya) సొంతం చేసుకున్నాడు. అయితే.. ఆయ‌న 2012లో అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. దాంతో విజ‌య్ మాల్యా (Vijay Mallya) స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయ‌డం ద్వారా ఆర్సీబీని డియోజియో సొంతం చేసుకుంది. అయితే డైజియో పీఎల్సీ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం.. అది ఆల్కహాల్ బేవరేజెస్ సంస్థ. కోట్లాదిమంది వీక్షించే ఐపీఎల్ మ్యాచ్​లలో(IPL matches) పొగాకు, మద్యపాన సేవనాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి అడ్వర్టయిజ్ మెంట్లు ఉండకూడదంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో.. డైజియో (diageo) ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు.