అక్షరటుడే, వెబ్‌డెస్క్:RCB Fans | ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ RCB గెలవడంతో బెంగళూరులో పండుగ వాతావరణం నెలకొంది. నగరంలో ఓ చోట.. ఫ్యాన్స్ బస్సు ఎక్కి సంబరాలు చేసుకున్నారు. డాన్స్‌లతో అదరగొట్టారు. ఎవరికి నచ్చినట్టు వారు సంబురాలు చేసుకున్నారు. 17 ఏళ్లుగా ట్రోఫీ(IPL Trophy) కోసం పరితపిస్తూ వచ్చిన ఆర్సీబీ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్‌లో కప్ ఎగరేసుకుపోయింది. 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా అవతరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-2025(IPL 2025) ఫైనల్‌లో.. ఆర్సీబీ(RCB) 6 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్రను తిరగరాసింది.
RCB Fans | వీళ్ల రూటే సపరేటు..
ఈ విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్(Allu Ayan) కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. అయాన్.. విరాట్ కోహ్లీ(Virat Kohli)కి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించడంతో బన్నీ తనయుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకుని భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియోను అల్లు అర్జున్(Allu Arjun) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోగా, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరో వైపు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను అర్ధాంగి లికితారెడ్డి ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేస్తూ.. “ఈ సాలా కప్ నమ్‌దు. 18 ఏళ్ల కల నెరవేరింది అని కామెంట్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే అభిమానులు ఫుల్ జోష్ వచ్చినప్పు డీజే పెట్టి మరి రచ్చ చేస్తుంటారు. అయితే డీజేలకు పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో కొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ పోలీస్ సైరస్(Police Cyrun) ఆన్ చేసి మరీ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏంది రా బాబు ఒక్కొక్కళ్లు ఇలా ఉన్నారు అసలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత ఆర్సీబీ(RCB) ఇంత మంచి విజయం సాధించడం చాలా మందికి ఆనందాన్ని కలిగించింది.