RCB

అక్షరటుడే, వెబ్​డెస్క్:RCB Fan Request | ఐపీఎల్ 2025 IPl 2025 సీజన్ మ‌రికొద్ది రోజుల‌లో ముగ‌గియ‌నుంది. ఫైన‌ల్‌లో పాల్గొనే ఒక టీం ఎవ‌రో తెలిసిపోయింది.

మ‌రికొద్ది రోజుల‌లో సెకండ్ ఫైన‌లిస్ట్ ఎవ‌ర‌నేది కూడా తెలియ‌నుంది. అయితే ఈ సారి ఎవ‌రు ట్రోఫీ ద‌క్కించుకుంటారు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గురువారం జరిగిన తొలి క్వాలిఫైయర్‌(First qualifier)లో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తుంది. కప్ గెలవాలనే తమ కలను చేరుకోవడానికి ఇంకా ఒక అడుగు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఓ ఆర్సీబీ అభిమాని ఏకంగా కర్ణాటక సీఎం(Karnataka Chief Minister)కి లేఖ రాశాడు.

RCB Fan Request | సీఎంకీ లేఖ…

ఒక వేళ ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే.. జూన్‌ 4న ‘ఆర్సీబీ అభిమానుల పండుగ’గా ప్రకటించి, ఒక రోజు సెలవు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు లేఖ రాశాడు. బెల్గాం జిల్లాలోని గోకాక్‌కు చెందిన శివానంద్ మల్లన్నవర్ అనే యువకుడు ఆర్సీబీ అభిమాని(RCB Fan). గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ PSPKపై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ పోరుకు అర్హత సాధించగా, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్-2లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకొని.. హాట్‌ ఫేవరేట్‌లా కనిపిస్తున్న తరుణంలో ఆర్సీబీ ఫైనల్‌ గెలిస్తే.. సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని కోరాడు.

అన్ని జిల్లాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఐపిఎల్ కప్ గెలిస్తే, ప్రభుత్వం ఆ రోజును ‘కర్ణాటక రాష్ట్ర ఆర్‌సిబి అభిమానుల పండుగ’గా అధికారికంగా ప్రకటించి, ప్రతి సంవత్సరం సెలవు ఇవ్వాలి. RCB అభిమానుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందున, ప్రతి జిల్లాలో కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకునే విధంగానే RCB అభిమానుల పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వం (Karnataka Government) వీలు కల్పించాలని” లేఖలో కోరాడు. మరి దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.