Bengaluru Stampede
RCB donates prize money |తొక్కిస‌లాట‌లో 11మందికి పైగా మృతి.. మృతుల కుటుంబాలకు ఆర్‌సీబీ ప్రైజ్‌మనీ?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RCB prize money : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) Royal Challengers Bangalore (RCB) ఫ్రాంచైజీ విచారం వ్యక్తం చేసింది. ఇది ఒక దురదృష్టకర సంఘటనని, మీడియా ద్వారానే తాము ఈ విషయం తెలుసుకున్నామని, ఈ ఘటన మ‌మ్మ‌ల్ని ఎంతో క‌లిచి వేసింద‌నే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ బుధవారం బెంగళూరు నగరంలో నిర్వ‌హించిన‌ విక్టరీ పరేడ్ Victory Parade లో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌కరం. ఈ ఘటనలో దాదాపు 11 మంది మరణించగా.. 50 మంది వరకు గాయపడ్డారు.

క్రికెట్‌పై Cricket ఉన్న పిచ్చితో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. విజయోత్సవ వేడుక (victory celebrations)ల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, ఇందులో ఆర్సీబీ ఫ్రాంచైజీ RCB franchise బాధ్యతారాహిత్యం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘చిన్నస్వామి స్టేడియం Chinnaswamy Stadium బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాము. ఈ మధ్యాహ్నం జట్టు రాక సందర్భంగా బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు.. ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం.

ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం జ‌రిగింద‌నే విష‌యం మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేశాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం అని ఆర్‌సీబీ తమ ప్రకటనలో తెలియ‌జేసింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలవడంతో వచ్చిన రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీని Prize Money మృతుల కుటుంబ సభ్యులకు అందజేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. కోట్లు పెట్టినా పోయిన ప్రాణాలను తీసుకురాలేమని, కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయంfinancial assistanceతో భరోసా ఇవ్వాలని హితవు పలుకుతున్నారు.