rcb
RCB | ఆర్సీబీనా మ‌జాకానా.. 20 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో స‌రికొత్త చ‌రిత్ర‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:RCB | రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టేడియంలోనే కాకుండా బ‌య‌ట కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది.

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయాలతో పాటు ఆ టీమ్‌ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. ఐపీఎల్ 2025కి ముందు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీమ్‌గా సీఎస్కే(CSK) ఉంటే.. ఈ సీజన్ ఆరంభంలోనే చెన్నైని ఆర్సీబీ క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రేర్ ఫీట్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో సింహాసనం ఏసుకుని కూర్చొంది ఆర్సీబి.

RCB | రేర్ ఫీట్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ Instagram అకౌంట్‌ 20 మిలియన్ల ఫాలోవర్స్‌ని టచ్ చేయ‌డం విశేషం. సీజన్ ఆరంభంలో సీఎస్కే టాప్ పొజిషన్‌(CSK top position)లో ఉండగా.. ఆర్సీబీ వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్‌(Play Offs)కి వెళ్లడంతో ఆ టీమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్ర‌మంగా పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కి 18.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా, ముంబై ఇండియన్స్‌కి 18 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 20 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను అందుకున్న మొదటి ఫ్రాంఛైజీగా ఆర్సీబీ నిలవడం విశేషం. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్ర(IPL history)లో ఒక్క టైటిల్ కూడా అందుకోపోయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఫ్యాన్ బేస్ మాత్రం మాములుగా ఉండ‌దు.

ఐదేసి కప్‌లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కూడా ఆర్సీబీ తర్వాతే ఉన్నాయంటే ఆర్సీబీ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. చెన్నైలో ధోని(MS Dhoni)కి విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌గా, ముంబైలో రోహిత్‌(Rohith Sharma)కి ఉంది. వారిద్ద‌రి క‌న్నా ఎక్కువ క్రేజ్ విరాట్‌(Virat Kohli)కి ఉంద‌ని తాజాగా నిరూపిత‌మైంది.

మొత్తానికి ఐపీఎల్ 2025 నాటికి ఆర్సీబీ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుని నెట్టింట హవా కొనసాగిస్తోంది. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలను నమోదు చేసింది. 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఎనిమిది గెలిచి, నాలుగు ఓడగా.. ఒక మ్యాచ్ రద్దయింది. 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు ఆర్సీబీ మ‌రో మ్యాచ్ ఆడ‌నుండ‌గా, ఈ గేమ్‌తో ఏ స్థానంలో ఉంటుందో అర్ధ‌మ‌వుతుంది.