అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RCB Stampede | బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిచనున్నట్లు తెలిపింది.
ఆర్‌సీబీ తొలిసారి IPL 2025 టైటిల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో బెంగళూరు(Bangalore)లో నిర్వహించిన వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రపంచ క్రికెట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట(Stampede)కు ఆర్‌సీబీతో పాటు కేసీఏ, కర్ణాటక ప్రభుత్వానిదేనని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆర్‌సీబీ.. తాజాగా ఓ ప్రకటన చేసింది.
RCB Stampede | అది మా బాధ్యత
తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారాన్ని(Rs.25 Lakhs Compensation) ప్రకటించింది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, బాధితుల పట్ల తమ బాధ్యత అని పేర్కొంది. “జూన్ 4, 2025న మా హృదయాలు బద్దలయ్యాయి. మేము RCB కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను కోల్పోయాము. వారు మనలో భాగమే. మన నగరం, మన సమాజం & మన జట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో భాగం. వారు లేకపోవడం మనలో ప్రతి ఒక్కరి జ్ఞాపకాలలో ప్రతిధ్వనిస్తుంది” అని RCB ట్వీట్ చేసింది. “వారు వదిలిపెట్టిన ఖాళీని ఎంత మద్దతు ఇచ్చినా పూరించలేరు. కానీ మొదటి అడుగుగా, అత్యంత గౌరవంతో, RCB బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹25 లక్షలు అందిస్తుందని” తెలిపింది. తొక్కిసలాట బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ, ఇది ప్రారంభం మాత్రమేనని, ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మద్దతుగా ఉంటామని తెలిపింది