Homeబిజినెస్​RBI repo rate | గుడ్ న్యూస్.. రెపో రేటు ప్రభావం.. తగ్గనున్న హోం లోన్...

RBI repo rate | గుడ్ న్యూస్.. రెపో రేటు ప్రభావం.. తగ్గనున్న హోం లోన్ ఈఎంఐ​ భారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI repo rate | రుణ గ్రహీతలకు ఆర్​బీఐ శుభవార్త తెలిపింది. రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఇటీవల రెపో రేటు ముచ్చటగా మూడోసారి భారీగా తగ్గించింది. ఈ క్రమంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం ప్రభావం తగ్గనుంది. హోం లోన్​ తీసుకున్నవారిపై ఈఎంఐ వడ్డీ భారం తగ్గబోతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Reserve Bank of India (ఆర్‌బీఐ) RBI నుంచి మరోసారి గుడ్ న్యూస్ అందింది. మ‌రోసారి వ‌డ్డీ రేట్ల‌ని స‌వ‌రించి రుణ గ్రహీతలకు భారీ ఉపశమనం లభించింది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేటు తగ్గి నెలవారీ ఈఎంఐ దిగిరానుంది. దీంతో నెల, ఏడాది చొప్పున భారీగా ఆదా చేసుకునే అవకాశం లభించనుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి చేరనుంది. ఆర్​బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది.ఈ నిర్ణ‌యంతో ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గుతుంది. అలాగే కొత్తగా హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్స్ తక్కువ వడ్డీకే లభిస్తాయి.

RBI repo rate | లోన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌..

ఆర్​బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు ఒక శాతం మేర తగ్గింది.2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 6.5శాతం, రెండో త్రైమాసికంలో 6.7శాతం జీడీపీGDP నమోదు కావచ్చని అంచనా. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6శాతం, 6.4శాతం ఉండవచ్చు.ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కనుక 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4శాతం నుంచి 3.7శాతానికి తగ్గే అవకాశం ఉంది.బ్యాంకుల వద్ద నగదు నిల్వల (సీఆర్​ఆర్​) CRR నిష్పత్తిని 100 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం అని ఆర్బీఐ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, స్థిరంగా కొనసాగుతున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా Sanjay Malhotrs పేర్కొన్నారు . వేగంగా వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. రెపో రేటు 5.50 శాతానికి పరిమితమైన క్రమంలో బ్యాంకులు హోమ్ లోన్, పర్సనల్, వెహికల్ లోన్స్ వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. ఇది లోన్ తీసుకున్న వారితో పాటు, లోన్ తీసుకోబోయే వారికి అదనపు భారాన్ని తగ్గిస్తుంది.