అక్షరటుడే, వెబ్డెస్క్: Gold reserves | అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల(Economic uncertainties)తో ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల central banks మాదిరిగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బంగారం(Gold) నిల్వలను భారీగా పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆర్‌బీఐ (RBI) 25 టన్నుల పుత్తడిని కొనుగోలు చేసింది. పసిడి ధరలు భారీగా పెరిగిన తరుణంలో ఇంత భారీ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడం గమనార్హం.
2024 సెప్టెంబర్ నాటికి ఆర్‌బీఐ RBI వద్ద 854.73 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు(Gold reserves) ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం financial year ముగిసే నాటికి ఆ నిల్వలు 879.59 టన్నులకు చేరడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం(Financial year) మొత్తంలో ఆర్‌బీఐ మొత్తం 57 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
ఏడేళ్లలో ఈ స్థాయిలో పుత్తడి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ RBI వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల్లో gold reserves స్థానికంగా 511.99 టన్నులు ఉండగా.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (Bank of England), బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద 348.62 టన్నులు, గోల్డ్ డిపాజిట్ల రూపంలో 18.98 టన్నులు ఉన్నాయి. భారత్(Bharath) దగ్గర ఉన్న మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 11.70 శాతానికి చేరింది. ఆరు నెలల క్రితం ఈ మొత్తం 9.32 శాతంగా ఉంది.