Homeబిజినెస్​RBI | బ్యాంక్‌ నిఫ్టీకి ఆర్‌బీఐ బూస్ట్‌.. సీఆర్‌ఆర్‌ రేట్‌ కట్‌తో పరుగులు తీస్తున్న ప్రైవేట్‌...

RBI | బ్యాంక్‌ నిఫ్టీకి ఆర్‌బీఐ బూస్ట్‌.. సీఆర్‌ఆర్‌ రేట్‌ కట్‌తో పరుగులు తీస్తున్న ప్రైవేట్‌ బ్యాంక్‌ స్టాక్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI | ఆర్‌బీఐ వడ్డీ రేట్లను (interest rates) తగ్గిస్తుందని ఆశించిన మార్కెట్లకు డబుల్‌ బూస్ట్‌(Double boost) ఇచ్చింది. రెపో రేట్‌ను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన కేంద్ర బ్యాంక్‌.. క్యాష్‌ రిజర్వ్‌ రేషియో(Cash reserve ratio)ను ఒకేసారి వంద బేసిస్‌ పాయింట్ల(Basis points)ను తగ్గించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు అదనపు లిక్విడిటీ అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) ప్రకటించారు. దీంతో సీఆర్‌ఆర్‌(CRR) 4 శాతంనుంచి 3 శాతానికి తగ్గనుంది. అయితే నాలుగు విడతలలో దీనిని తగ్గించనున్నారు. సెప్టెంబర్‌ 6, అక్టోబర్‌ 4, నవంబర్‌ 1, నవంబర్‌ 29 లలో 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున సీఆర్‌ఆర్‌ తగ్గుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో 2.5 లక్షల కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్‌ సెక్టార్‌(Banking sector) ప్రధానంగా ప్రైవేట్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ పరుగులు తీస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ జీవన కాల గరిష్టాలకు చేరింది. మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో బ్యాంక్‌ నిఫ్టీ 825 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌(IDFC first bank) 5 శాతానికిపైగా పెరగ్గా.. యాక్సిస్‌ బ్యాంక్‌ 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.17 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.8 శాతం, ఏయూ బ్యాంక్‌ 1.7 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

RBI | జీడీపీ అంచనాలు..

ఆర్‌బీఐ వాస్తవ జీడీపీ(GDP) అంచనాలను కంటిన్యూ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 6.7 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 6.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంటుందని పేర్కొంది.

Must Read
Related News