అక్షరటుడే, వెబ్‌డెస్క్: RBI Bonds | స్టాక్ మార్కెట్‌లో stock market ఎక్కువ రాబడి సాధించే అవకాశాలుంటాయి. అయితే రిస్క్(Risk) కూడా అంతే స్థాయిలో ఉంటుంది. సరైన స్టాక్స్‌ను ఎంచుకోకపోతే లాభాలు దేవుడెరుగు.. పెట్టుబడి హరించుకుపోయే ప్రమాదం ఉంటుంది. మ్యూచ్‌వల్ ఫండ్స్(Mutual funds) ద్వారా కూడా మంచి లాభాలు వస్తాయి. అయితే ఇదీ రిస్క్‌తో కూడుకున్నదే.. అప్పుగా ఇవ్వడం ద్వారా వడ్డీ పొందవచ్చు. అయితే ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు.. ఈ నేపథ్యంలో చాలా మంది రిస్క్‌లేని రాబడి(Retutn) కోసం రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు.
రాబడి తక్కువైనా ఎఫ్‌డీలకే మొగ్గు చూపుతారు. అయితే ఎఫ్‌డీ(FD)కన్నా ఎక్కువ రాబడిని ఇచ్చే ఆర్‌బీఐ బాండ్ల గురించి తెలియక చాలామంది అదనపు రాబడిని పొందలేకపోతున్నారు. ఈ బాండ్లపై అధిక వడ్డీ లభించడంతోపాటు ఆర్‌బీఐ సార్వభౌమ గ్యారంటీ కూడా ఉంటుంది. దీంతో మన సొమ్ముకు పూర్తి భద్రత లభిస్తుంది. తక్కువ పన్ను పరిధిలో ఉండి రిస్క్‌లేని రాబడి కోసం చూస్తున్నవారు, సీనియర్ సిటిజన్లు(Senior citizens), ఏడేళ్ల వరకు డబ్బు అవసరం లేనివారు ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు కొనుగోలు చేయడం మేలు.
RBI Bonds | ఎక్కడ లభిస్తాయంటే..
ఆర్‌బీఐ ఆథరైజేషన్ ఉన్న ఏ బ్యాంక్ ద్వారానైనా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్ల(Bank website) ద్వారా, ఆర్‌బీఐకి చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా కూడా బాండ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
RBI Bonds | గమనించాల్సిన అంశాలు..
- ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల(RBI floating rate savings bond) కాలపరిమితి ఏడేళ్లు.
- కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.
- ఈ బాండ్లపై పన్ను మినహాయింపు ఉండదు.
- వడ్డీ రేట్లు(Interest rates) ఫిక్స్‌డ్‌గా ఉండవు. ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం(Central government) వడ్డీ రేట్లు పెంచితే ఆర్‌బీఐ బాండ్లపైనా వడ్డీ రేటు పెరుగుతుంది. తగ్గిస్తే తగ్గుతుంది.
- జనవరి 1, జూలై 1 తేదీలలో వడ్డీ జమ అవుతుంది.
- వీటిని ముందస్తుగా విత్‌డ్రా(Withdraw) చేసుకునే అవకాశం లేదు. అలాగే రుణ సదుపాయం కూడా వర్తించదు. అయితే విత్‌డ్రా విషయంలో సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఉంటుంది. లాకిన్ పీరియడ్(Lockin period) పూర్తయ్యాక పెనాల్టీతో సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు. 60 -70 ఏళ్లలోపువారికి ఆరేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
- 70- 80 ఏళ్లలోపువారికి లాకిన్ పీరియడ్ ఐదేళ్లు, 80ఆపైన వయసున్నవారికి నాలుగేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది.
- ఆర్‌బీఐ బాండ్లపై వడ్డీరేటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (National Savings Certificate)తో ముడిపడి ఉంటుంది. ఎన్‌ఎస్‌సీ కన్నా 0.35 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీ(NSC)లపై వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంది. ఇది డిసెంబర్ వరకు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.