HomeUncategorizedRBI | రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం..

RBI | రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: RBI | ఏటీఎం(ATM)ల నుంచి రెగ్యులర్‌గా మనీ విత్‌డ్రా చేసే వారు ఈ విష‌యాన్ని గ‌మనించాలి. దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India), రూ.100, రూ.200 నోట్లకు సంబంధించి ఒక ఆర్డర్ జారీ చేసింది. రెండు నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన సూచనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని బ్యాంకులను కోరింది. దీనికోసం ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఏటీఎం నుంచి రూ.100, రూ.200 వంటి చిన్న విలువ కలిగిన నోట్లను ప్రజలు సులభంగా పొందేలా RBI కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఏటీఎంలలో క్రమం తప్పకుండా రూ.100, రూ.200 నోట్లను ఉంచాలని చెప్పింది.

RBI | ఇక ఆ స‌మ‌స్య‌లు ఉండ‌వు..

రూల్ ప్రకారం.. 2025 సెప్టెంబర్ 30 నాటికి అన్ని ATMలలో కనీసం 75% కనీసం ఒక క్యాసెట్ (నగదు ఉంచే భాగం) రూ.100 లేదా రూ.200 నోట్లతో నిండి ఉండాలి. 2026 మార్చి 31 నాటికి భారతదేశం అంతటా ATMలలో 90 శాతానికి పెరగాలి. ఈ మార్పుతో ప్రజలు ఏటీఎంల నుంచి చిన్న నోట్లు రిసీవ్ చేసుకోవచ్చు. దీంతో చిల్లర సమస్యలు తీరుతాయి. ప్రజలకు చిన్న డినామినేషన్ నోట్ల లభ్యత పెరగాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ(RBI) అన్ని బ్యాంకులకు, అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేకంగా సర్క్యులర్ పంపించింది. మనం ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా(Money Withdraw) చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో పెద్ద నోట్లే వస్తాయి. రూ.100, రూ.200 నోట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. తక్కువ స్పేస్‌లో ఎక్కువ మనీ పెట్టవచ్చు కాబట్టే బ్యాంకులు పెద్ద నోట్లకు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే ఆర్బీఐ RBI తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఈ సమస్య ఉండకపోవచ్చు.

సెప్టెంబర్ 30, 2025 నాటికి – కనీసం 75శాతం ఏటీఎంలలో ఒక్కటైనా క్యాసెట్ రూ.100 లేదా రూ.200 నోట్ల కోసం ఉండాలి. మార్చి 31, 2026 నాటికి – కనీసం 90శాతం ఏటీఎంలలో అలాంటి క్యాసెట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు చిన్ననోట్ల Small Notes అవసరం తీర్చడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. రూ.100, రూ.200 నోట్లు ప్రజల నిత్యవసరాల లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న కారణంతో ఈ ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.