HomeUncategorizedTollywood Ravi Teja | ర‌వితేజ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

Tollywood Ravi Teja | ర‌వితేజ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tollywood Ravi Teja : సినీ ఇండ‌స్ట్రీ (film industry) లో వ‌రుస‌గా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కోట శ్రీనివాస‌రావు (Kota Srinivasa Rao) మృతితో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రియుల‌కు తెల్లారే మ‌రో షాక్ త‌గిలింది. అల‌నాటి అందాల న‌టి(beautiful actress) స‌రోజా దేవి (Saroja Devi) క‌న్నుమూశారు.

ఈ రెండు మ‌ర‌ణాలు చాలా మందిని క‌లిచి వేశాయి. ఇక ఇప్పుడు ర‌వితేజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రవితేజ Ravi teja తండ్రి, ప్రముఖ ఫార్మాసిస్టు భూపతిరాజు రాజగోపాల్ రాజు మంగ‌ళ‌వారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయన కుమారుల్లో ర‌వితేజ స్టార్ హీరోగా ఎదిగారు.

Tollywood Ravi Teja : ర‌వితేజ ఇంట్లో విషాదం..

రాజ‌గోపాల్ రాజు త‌న‌యుల‌లో భరత్ రాజు Bharat Raj 2017 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరొక కొడుకు రఘు కూడా ఇండ‌స్ట్రీలో న‌టుడిగా రాణిస్తున్నారు. అతని కుమారుడు మాధవ్ రాజ్ భూపతి త్వరలో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ర‌వితేజ తండ్రి వృత్తి రీత్యా ప‌లు ప్రాంతాల‌లో ఉద్యోగం చేయాల్సి రావ‌డంతో తాను అనేక ప్రాంతాలు తిరగాల్సి వ‌చ్చేద‌ని రవితేజ ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

రాజ గోపాల్ రాజు స్వ‌గ్రామం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జ‌గ్గంపేట కాగా, ఉద్యోగ‌రీత్యా పలు ప్రాంతాల‌కి వెళుతూ ఉండేవారు. అనేక ప్రాంతాల‌కి ర‌వితేజ కూడా వెళుతూ ఉన్న‌నేప‌థ్యంలో ఆయ‌న ప‌లు యాస‌ల‌లో అవ‌లీల‌గా మాట్లాడ‌తాడు.

ఇక రవితేజ సినిమాల విష‌యానికి వ‌స్తే కిశోర్‌ తిరుమల Kishore tirumala దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. కామెడీ ప్ర‌ధానంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Must Read
Related News